telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ కాపులకు సీఎం జగన్ దీపావళి కానుక…

cm jagan

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం జగన్‌ మరో శుభవార్త చెప్పారు. కాపునేస్తం పథకానికి అర్హులైన కొత్త లబ్దిదారుల జాబితాను ఏపీ ప్రభుత్వం సిద్దం చేసింది. కొత్తగా 95,245 మందికి కాపునేస్తం పథకాన్ని వర్తింపజేయనున్నారు. కొత్త లబ్దిదారుల కోసం ప్రభుత్వం రూ.142.87 కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కాపు నేస్తం ద్వారా నిధులు అందిస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. సీఎం జగన్‌ ఇస్తున్న దీపావళి కానుక ఇదే అని కూడా అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. సీఎం జగన్‌ సేవకుడిగా..ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. బాధల్లో ఉన్న వ్యక్తిని చూస్తే చలించే మనస్తత్వం కలిగిన మనసున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ఎందరి సమస్యలో విన్నారని, వాటికి ఇప్పుడు పరిష్కారం చూపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలోనని దారులు వెతుక్కునే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు హాయాంలో ఏపీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు.

Related posts