పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పర్యాటకుల భద్రత తమకు ముఖ్యమని పేర్కొన్నారు. బోటు ప్రమాదం బాధాకరమని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రయివేటు పార్టనర్ షిప్ ద్వారా కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఏదైనా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. మూడు నెలల్లో ఇంతవరకు ఒక్కరిపై అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. గ్రామ సచివాలయం,వార్డు వలంటీర్ల పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. అభివృద్ధికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేసిన వ్యక్తి సీఎం జగనే అని పేర్కొన్నారు.
రాజశేఖరరెడ్డి కూడు పెడితే..జగన్ పొట్ట కొడుతున్నారు: కన్నా