telugu navyamedia
రాజకీయ వార్తలు

బడ్జెట్ ప్రసంగం పై స్పందించిన నిర్మలా

Nirmala seetharaman

ఈ నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2020-21 వార్గిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం విధితమే. తాజాగా తన ప్రసంగంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే వేళ, తాను అసౌకర్యాన్ని కలిగించానని, అందుకు చింతిస్తున్నానని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. చివర్లో కొన్ని పేజీలను చదవకుండానే, ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసినట్టు చెప్పి కూర్చుండిపోయారు.

ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రతి విషయంపైనా విపులంగా, జాగ్రత్తగా మాట్లాడాల్సి రావడంతోనే ఎక్కువ సేపు ప్రసంగించాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. తాను చివరిలో నీళ్లు తాగిన తరువాత, మిగతా పేజీలను కూడా చదివి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని తెలిపారు.

Related posts