మన దేశాన్ని మొత్తం రగిలించిన ఘటన పుల్వామా అటాక్. పాక్ చేసిన ఈ పిరికిపంద చర్య భారత దేశాన్ని మొత్తం కదిలించింది. అయితే ఇప్పుడు పుల్వామా దాడి తమ ఘనతే అని చాటుకుంది పాకిస్తాన్. భారత్ లో చొరబడి.. పుల్వామా లో మారణహొమం సృష్టించింది తామనంటూ ప్రకటించారు పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి. పుల్వామా ఘనత నూటికి నూరు శాతం ఇమ్రాన్ ఖాన్ సొంతమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఫవద్ చౌదరి.దాడిలో తమ ప్రభుత్వం పాత్ర ఉందంటూ పాక్ మంత్రి స్వయంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించారు. పుల్వామా ఉగ్రదాడిని పాకిస్థాన్ ఘనకార్యంగా చెప్పుకుంటుందన్నారు కేంద్ర మంత్రి వీకే సింగ్. అయితే… పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని మరోసారి నిర్ధారణైందన్నారు. పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సమాజం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు వీకే సింగ్. పుల్వామా దాడి అనంతరం భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను పేల్చివేసింది.
previous post
నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారు… “నగ్నం” హీరోయిన్