telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్, చైనాల మధ్య క్లిష్ట పరిస్థితులు: డొనాల్డ్ ట్రంప్

trump usa

సరిహద్దుల విషయంలో ఇండియా, చైనాల మధ్య అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొని వున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

భారత్ తో పాటు చైనాతోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్యా చాలా పెద్ద సమస్య ఉందని, వారి మధ్య ఘర్షణ కూడా జరిగిందని అన్నారు. సమస్యలను శాంతియుతంగా అధిగమించాలని చెప్పారు. అందుకోసం అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ట్రంప్ ఆది నుంచి ఈ విషయంలో ఇండియాకు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు పాల్పడుతోందని ఇటీవల ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Related posts