telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా విజృంభణ.. ఇండియాలో ఒకే రోజు 2 లక్షలకు చేరువలో కేసులు

దేశంలో కరోనా విలయం మరింత ఉదృతం అవుతోంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదవగా 1026 మంది మృతి చెందారు. గడచిన 6 నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదు కావడం గమనార్హం. గడచిన 24 గంటలలో మహారాష్ట్రలో 60,212 కొత్త “కరోనా” కేసులు, ఉత్తర ప్రదేశ్ 18,021 కేసులు, ఢిల్లీలో 13,468 కొత్త “కరోనా” కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటలలో మహారాష్ట్రలో గరిష్ట ప్రాణనష్టం (281) నమోదు కాగా… ఉత్తరప్రదేశ్ లో 85 మంది మృతి చెందగా, ఢిల్లీ లో 81 మరణాలు నమోదు అయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 12 నాటికి దేశంలో మొత్తం 25,92,07,108 నమూనాలను పరీక్షించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,38,52,599 కేసులు నమోదు కాగా, 1,71,929 మరణాలు నమోదు అయ్యాయి. “కరోనా” కేసుల నిర్ధారణలో బ్రెజిల్‌ను భారత్ అధిగమించింది. బ్రెజిల్ లో ప్రస్తుతం రోజుకు సగటున 72,000 కేసులు నమోదు అవుతుండగా.. అలాగే, బ్రెజిల్ లో రోజుకు సగటున 3,100 కంటే ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. బ్రెజిల్ లో ఇప్పటివరకు మొత్తం 3,54,617 మరణాలు నమోదు కాగా…ఈ మరణాల సంఖ్య భారతదేశం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది. భారత్ లో ఇప్పటివరకు 10,85,33,085 వ్యాక్సిన్ డోసులు (మోతాదులు) అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిచింది.

Related posts