telugu navyamedia
సినిమా వార్తలు

భారీ రేటుకు “డియర్ కామ్రేడ్” ప్రీ రిలీజ్ బిజినెస్

Dear-Comrade

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్‌” ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ శుక్రవారమే గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నాలుగు భాషల్లో కలిసి “డియర్ కామ్రేడ్” ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. రూ. 36.40 కోట్లకు జరిగినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ.9 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. రాయలసీమ (సీడెడ్) రూ.3.60 కోట్లకు అమ్ముడు పోయింది. ఏపీ విషయానికొస్తే.. ఈస్ట్ గోదారి రూ.1.80 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.1.40 కోట్లు, గుంటూరు రూ.2 కోట్లు, కృష్ణ రూ.1.60 కోట్లు, నెల్లూరు. రూ.80 లక్షలకు మిగిలిన ఏరియాల్లో రూ. 2.40 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 22.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలలో కలిపి రూ.8 కోట్లకు అమ్ముడు పోయింది. ఓవర్సీస్‌లో రూ.4 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మొత్తంగా రూ.34.60 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా విజయ్ దేవరకొండ‌ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అధనం. ఏ రకంగా చూసిన ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్‌కు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ అందించదనే చెప్పాలి. మరి చూడాలి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.

Related posts