telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

దామరచర్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

Accident

దామరచర్ల మండలం కొండ్రపోల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన అంబులెన్స్ వాహనం వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్టి తెలుస్తోంది. అంబులెన్స్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు జి. కమలాకర్ రెడ్డి (48), నందగోపాల్ రెడ్డిగా గుర్తించారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి నందగోపాల్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యపు చేస్తున్నారు.

Related posts