telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు, సురేఖకు మరో కొడుకు… హ్యాపీ బర్త్ డే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ : మెగాస్టార్

akhil

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని 26వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ నుంచి ఓ లుక్ విడుదల చేసింది మూవీ యూనిట్. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి “హ్యాపీ బర్త్‌డే అఖిల్. చరణ్‌కి ఒక తమ్ముడు. నాకు, సురేఖకు మరో కొడుకు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. అందరూ ఇష్టపడే వ్యక్తి. ఈ ఏడాదంతా నీకు మంచి జరగాలి’ అంటూ తనకు, నాగార్జునకు మధ్యలో ఉన్న చిన్నారి అఖిల్ ఫోటోను పోస్ట్ చేశారు చిరు.

Related posts