telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బీజేపీలోకి విశాల్… స్పందించిన హీరో ?

Vishal

గత కొంతకాలంగా హీరో విశాల్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆర్‌.కె.నగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని విశాల్ భావించాడు. అయితే విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇకపోతే తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగానూ, దక్షిణ భారత ఎన్నికల సంఘంకు కార్యదర్శిగానూ విశాల్‌ పనిచేస్తున్నాడు. ఈనెల 14న లేదా 15న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరో విశాల్‌ బీజేపీలోకి చేరుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీలో చేరే అంశంపై చర్చించేందుకు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మురుగన్‌ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. తమిళనాట ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. హీరో విశాల్‌కు రాజకీయాలంటే చాలా ఆసక్తి. ఎప్పటికప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాలపై అధ్యయనం చేస్తూ ఉంటారు.అయితే తాను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విశాల్‌ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.

Related posts