telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఎస్వీబీసీ .. భక్తి ఛానల్ కు .. నటుడు పృథ్వీరాజ్ చైర్మన్ ..

actor prudviraj as chairmen of svbc channel

నటుడు పృథ్వీరాజ్ కు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పదవి దక్కింది. నేడు తిరుపతిలో ఎస్వీబీసీ బోర్డు సమావేశం జరగ్గా, పృథ్వీరాజ్ నియామకానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఎస్వీబీసీ నూతన చైర్మన్ గా నియమితుడైన పృథ్వీరాజ్ ఈ నెల 28న పదవీప్రమాణస్వీకారం చేస్తారు.

టీడీపీ పాలనలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడాయన స్థానంలో వైసీపీ నేత పృథ్వీరాజ్ కు చైర్మన్ పదవి లభించింది.

Related posts