“సాహో” దర్శకుడు సుజీత్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ సాయం చేశాడు. సుజీత్ వద్ద ఉన్న ఒక కథ నచ్చడంతో తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో దాన్ని నిర్మించేందుకు వంశీ మరియు ప్రమోద్ లను ఒప్పించాడు. దాంతో గోపీచంద్ హీరోగా సుజిత్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడని సమాచారం. ఈ కాంబో సెట్ అవ్వడానికి పూర్తి కారణం ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరో రెండు మూడు నెలల్లో ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని, ఈ లోపు మిగిలిన నటీనటులను ఫైనల్ చేయబోతున్నారట. ఇక చిరంజీవి లూసిఫర్ రీమేక్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ సుజిత్… స్క్రిప్ట్ రెడీ చేసి, చిరును కన్విన్స్ చేయటంలో మాత్రం విఫలం అయ్యారు. దీంతో ఆ సినిమాను ప్రస్తుతానికి చిరంజీవి పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది.