telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి : స్పీకర్ తమ్మినేని

స్వగ్రామం తొగరాంలో ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ…  భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి అని.. ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చని పేర్కొన్నారు.   స్థానిక సంస్థలు శక్తివంతమైన వ్యవస్థ అని.. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసే వ్యవస్థ అని స్పష్టం చేశారు.  స్వేచ్ఛాయుత ఓటింగ్ కే తన  ప్రాధాన్యత అని.. తన స్వగ్రామం తొగరాంలో స్వేచ్ఛగా అందరూ పోటీ చేసుకునే వాతావరణం ఉందన్నారు.  ఇక్కడేదో జరిగిపోతుందనేది ప్రచారం మాత్రమేనని… ఐలవ్ డెమొక్రసీ, ఐ సపోర్ట్ డెమొక్రసీ, ఐ లివ్ డెమొక్రసీ అని తెలిపారు.   ప్రజాస్వామ్యం బ్రతికితేనే మనందరికీ బ్రతుకు , ధైర్యం అని..  మొన్నటి మున్సిపల్స్ లో ప్రో సీఎం ఓటింగ్ జరిగిందన్నారు.   ఈ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యయుతంగానే తీర్పు ఉంటుందనుకుంటున్నానని.. ప్రశ్నించే తత్వం పౌరుల్లో పెరగాలని సూచించారు.   ఒక ప్రతిపక్ష రాజకీయపార్టీ నిన్న కోర్టు ద్వారా ప్రశ్నించిందని..అది వారి హక్కు అని పేర్కొన్నారు. మొన్న స్టే అంటే అన్నీ మూసేశామని..నిన్న సెట్ గో అని విజిల్ కొట్టగానే సిద్ధమైపోయామన్నారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పులు ఇస్తారు అనేది.

Related posts