telugu navyamedia
క్రీడలు వార్తలు సినిమా వార్తలు

మహేష్ పాటకు డాన్స్ చేసిన వార్నర్‌…

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురుములో సినిమాలోని “బుట్టబొమ్మ” పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అప్పటి నుంచి.. టాలీవుడ్‌ హీరోల డైలాగులు, పాటలతో వీడియోలు చేస్తున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ వీడియోతో తన వీడియోల పరంపరను మొదలు పెట్టిన వార్నర్‌… తర్వాత స్టార్ హీరోల సినిమాలను ఎంచుకోని అందులోని కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి వీడియోలను చేస్తుంటాడు వార్నర్. ప్రస్తుతం వార్నర్ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ మహేష్‌బాబు సినిమా పాటకు స్టెప్పులేశాడు. మహేశ్‌ నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ పాటను రీఫేస్‌ యాప్‌తో ఛేంజ్‌ చేసి.. మహేష్‌ బాబు వేసిన స్టెప్పులు వార్నర్‌ వేసినట్లుగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. గతంలో బాహుబలిలో ప్రభాస్‌ డైలాగ్‌, రీసెంట్ గా ‘ఆచార్య’లో చిరంజీవి ఫైట్స్ లతో వార్నర్  సీనీ, క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. చుడాలిమరి వార్నర్ ఇంకా ఏం ఏం చేస్తాడు అనేది.

Related posts