చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం గొప్ప కార్యమే..చనిపోయిన ప్రతి మనిషి తమ అవయవాలను దానం చేస్తే ఈ భూమిపై కొన్ని కోట్ల మందికి ప్రాణదానం చేసినట్టవుతుంది. చనిపోయిన తరువాత బూడిదగా మారేకంటే అవయవాలను దానం చేయడం వలన పది మంది జీవితాల్లో వెలుగును నింపుతుంది..
సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉన్నారు కొందరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస‍్టు 13న ‘వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ను నిర్వహిస్తున్నారు. మనిషి చనిపోతూ మరో మనిషికి బతికించవచ్చే ఆలోచన చాలా గొప్పది.
మనిషి తన శరీరంలోని 200 అవయవాలను దానం చేయవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, కాళ్లు, చేతులు, కళ్లు, ఎముక మజ్జా ఇలా 200 వరకు అవయవాలను దానం చేయవచ్చు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి.
ఇక ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1954 వ సంవత్సరంలో రోనాల్డ్ హెన్రిక్ అనే వ్యక్తి తన సోదరుడికి కిడ్నీని దానం చేశాడు. దీనికి సంబందించిన ఆపరేషన్‌ను డాక్టర్ ముర్రే నిర్వహించారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో 1990లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఎంతోమంది ఆవయవాలను దానం చేస్తున్నారు. దీంతో చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం అవయవదానం ఇస్తోంది.