telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పరీక్షల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు!

students masks exams

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.అయితే.. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయకూడదని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. 

Related posts