telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వరద నీటిలో బీహార్ డిప్యూటీ సీఎం ఇల్లు..సుశీర్ మోదీని బోటులో తరలింపు!

4 died in chattishhgarh on rain

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జలమయమయ్యాయి. రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యూపీలో 111 మంది, బీహార్ లో 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క బీహార్ లోనే 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ఇంట్లోకి భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో, ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ లో గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో… జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు.

Related posts