telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమిత్ షా పై ప్లకార్డులతో దాడి…

చెన్నై ప‌ర్య‌ట‌న‌లో అమిత్ షా కు ఊచించని పరిణామం ఎదురయింది. ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వ‌చ్చిన‌ అమిత్ షా తన కారు నుంచి దిగిన ఆయ‌న‌ కొద్ది సేపు కాలి న‌డ‌క‌న ముందుకు సాగారు. త‌న‌ను ఆహ్వానించేందుకు వ‌చ్చిన వారికి అభివాదం చెప్పారు. అలా ఆయ‌న రెండు నిమిషాల పాటు ముందుకు వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంద‌రు వ్య‌క్తులు ఆయ‌న‌పై ప్లకార్డులు విసిరేందుకు విఫల‌య‌త్నం చేశారు. అమిత్‌ షా గో బ్యాక్ అని రాసి ఉన్న ఆ ప్ల‌కార్డులు.. అమిత్‌షాకు కొద్ది దూరంలో ప‌డిపోయాయి.అప్ర‌మ‌త్త‌మైన అమిత్‌షా సెక్యూరిటీ వాటిని వెంట‌నే అక్క‌డి నుంచి తొల‌గించారు. ముగ్గురు అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, న‌లుగురు జాయింట్ క‌మిష‌న‌ర్లు, 16 మంది డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, మ‌రో 3 వేల మంది పోలీసులు, ఒక బాంబు స్క్వాడ్.. ఇంత మంది ఉన్నా ఆయనా మీద ఈ ప్లకార్డు దాడి జరిగింది. ఇక ప్రస్తుతం మిత్రపక్షం అన్నాడీఎంకే నేతలతో పొత్తులపై ఆయన కీలక చర్చలు జరుపుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోంది కమల దళం. చూడాలి మరి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారు అనేది.

Related posts