telugu navyamedia
క్రీడలు వార్తలు

బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు…

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. 2016 సీజన్ నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న ఈ ఇంగ్లండ్ ప్లేయర్.. ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2018 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు. తన 5 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కరోనాతో ఆగిపోయిన తాజా సీజన్‌లోనూ బట్లర్ దుమ్ములేపాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీతో 254 రన్స్ చేశాడు. లీగ్ అర్థాంతరంగా వాయిదా పడటంతో స్వదేశం వెళ్లిన బట్లర్.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ తన ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్‌ను ప్రకటించాడు.

ఇక తన ఐపీఎల్ కెరీర్‌లో 66 ఇన్నింగ్స్‌లు ఆడిన బట్లర్ 1968 రన్స్ చేశాడు. అతనితో పాటు 150 స్ట్రైక్‌రేట్ ఉన్న హిట్ మ్యాన్‌ను ఎంచుకున్నాడు. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీలను తీసుకున్నాడు. కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా‌లను ఆల్‌రౌండర్లుగా, బెస్ట్ ఫినీషర్లుగా జట్టులోకి తీసుకున్నాడు. ఈ ఇద్దరు ఎంత విధ్వంసకర ఆల్‌రౌండర్లో అందరికి తెలిసిందే. ఇక పేస్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగాలతో భర్తీ చేశాడు. ఈ ముగ్గురు కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలరు. జడేజా తర్వాత ఏకైక స్పిన్నర్‌గా హర్భజన్ సింగ్‌ను బట్లర్ ఎంపిక చేశాడు.

జోస్ బట్లర్ ఆల్‌టైల్ ఐపీఎల్ ఎలెవన్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కీపర్), కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా

Related posts