కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను అరెస్ట్ చేయడం కక్ష సాధింపేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బీజేపీలో చేరనందుకే శివకుమార్ పై ఆ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీకి భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు మనుగడ లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని చెప్పారు.
శివకుమార్ అరెస్ట్ వెనుక ఇంతకు మించి మరో కారణం లేదని తెలిపారు. శివకుమార్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.డీకే శివకుమార్ ను అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా తెలుసని, అయినప్పటికీ కావాలనే అరెస్ట్ చేయించారని సిద్ధరామయ్య మండిపడ్డారు.చిదంబరంను అరెస్ట్ చేసిన తర్వాత శివకుమార్ ను టార్గెట్ చేశారని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
ఇళ్ల మధ్యలోనే మద్యం దుకాణాలు.. నారా లోకేశ్ విమర్శలు