telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దొనకొండకు రాజధాని వెళుతుందని టాక్.. భూముల ధరలకు రెక్కలు!

donakonda

ఏపీ రాజధానికి అమరావతి సరైన ప్రాంతం కాదని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధానిని వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని దొనకొండకు తరలించే అవకాశముందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దొనకొండ ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీంతో దొనకొండ ప్రాంతంలో ఇప్పుడు రియల్ బూమ్ వచ్చేసింది.

దొనకొండ ఏపీకీ రాజధాని అవుతుందో కాదో తెలియదు కానీ, వైసీపీ నేతలు మాత్రం భూముల కొనుగోలు పై దృష్టిసారించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే దొనకొండలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సముద్రం సమీపంలో కోడుగుడ్డు ఆకారంలో ఉన్న దొనకొండకు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళ్ళి భూముల కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ పెద్దగా రేట్లు లేని దొనకొండలో ఇప్పుడు ఎకరం రూ.60 లక్షలు పలుకుతుండగా, పక్క ప్రాంతాల్లో ఎకరం భూమి రూ.20 లక్షలకు చేరుకుంది. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనక్కి తగ్గకుండా భూములు కొనుగోలు చేస్తున్నారు.

Related posts