telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘సినిమా బండి’కి భారీ ప్రేక్షకాదరణ…

కరోనా సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో లో విడుదల అయిన ‘సినిమా బండి’కి భారీ ప్రేక్షకాదరణ లభిస్తోంది. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర, ముని వెంకటప్ప, ఉమా జి, సిరివెన్నెల యనమంధల, సింధు శ్రీనివాసమూర్తి, పూజారి రామ్ చరణ్, దవని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం కాగా… ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి సినిమా గురించి అసలేమీ తెలియని హీరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. డి 2 ఆర్ ఇండీ బ్యానర్‌లో రాజ్, డికె ద్వయం ఈ చిత్రాన్ని నిర్మించారు. సిరిష్ సత్యవోలు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉండడం విశేషం. ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ‘సినిమా బండి’ ఉంది. చూడాలి మరి సినిమా బండి మొదటి స్థానంలో ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది.

Related posts