కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతున్నారు. ఇక ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. నెలకు కోటి వ్యాక్సిన్ డోసులు ఇస్తేనే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది అని జగన్ తెలిపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రానికి సగటున నెలకు 19 లక్షల డోసులు మాత్రమే వస్తుంది. దాంతో కోవిడ్ వ్యాక్సినాల కొనుగోలు పై గ్లోబల్ టెండర్లకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 45 ఏళ్ళు పైబడిన వారికీ రెండో డోస్ వెంటనే ఇవ్వాలని జగన్ తెలిపారు. రెండో డోస్ అందకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం శూన్యం అని అన్నారు. ఇక 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిన తర్వాతే 18 ఏళ్లకు పై బడిన వారికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల