రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శనివారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్నిదర్శించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బద్రీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీకి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంబానీకి బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ధర్మాధికారి, ఆఫీసర్ భువన్ చంద్ర ఉనియల్ తదితరులు ఆలయం వద్ద సాదర స్వాగతం పలికారు.
బద్రీనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అంబానీ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గర్భాలయంలో భగవద్గీత ప్రవచనాలను కూడా శ్రద్ధగా అలకించారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో తమిళనాడులోని శాండిల్‌వుడ్ ఆలయంలో భూమి కొనుగోలుకు కూడా అంబానీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు.. జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు