కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ బారినపడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఏర్పాటుచేసిన ఉచిత కషాయం, మాస్క్‌ల పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు.
ప్రభుత్వ సూచ నలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. అందులో భాగంగా ఇలాంటి కషాయం వంటివి కూడా తీసుకుంటే మంచిదన్నారు.