telugu navyamedia
క్రీడలు వార్తలు

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ…

ఎమ్మెల్యేగా పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించిన తొలిసారే మంత్రి పదవి అందుకున్నాడు భారత మాజీ ఆటగాడు మనోజ్ తివారీ. సోమవారం కొలువు దీరిన మమతా బెనర్జీ నేతృత్వంలోని జంబో కాబినేట్‌లో మనోజ్ తివారీ యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మనోజ్ తివారీ షిబ్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మనోజ్‌కు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ షిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రథిన్ చక్రవర్తిపై తివారీ 6వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయితే మనోజ్ తివారీ భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.

Related posts