telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎట్టకేలకు సౌదీ మహిళలకు స్వేచ్ఛ.. గార్డియన్‌ షిప్‌ చట్టంలో మార

saudi_women_feeling

సౌదీ అరేబియాలోని మహిళలకు ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గార్డియన్‌ షిప్‌ చట్టంలో మార్పు చేసింది. దీంతో ఎప్పటి నుంచి అమల్లో ఉన్న సంకెళ్లలాంటి ఓ చట్ట పరిమితికి అక్కడి ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అక్కడి మహిళలు స్వేచ్ఛా విహంగాల్లా ఎగిరి పోయేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. సొంత నిర్ణయంతో పాస్‌పోర్టు తీసుకుని విదేశాలకు వెళ్లవచ్చు.

గార్డియన్‌షిప్‌ చట్టాన్ని భరించలేక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు సౌదీ నుంచి పారిపోయి విదేశాల్లో ఆశ్రయం పొందారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సౌదీ అరేబియా ఆదేశంలో మహిళలపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అక్కడి గార్డియన్‌షిప్‌ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణం చేయాలన్న తండ్రి, భర్త లేదా సోదరుడి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.ఇకపై అటువంటి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో గత ఏడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు కొందరు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్ధమంటూ విమర్శలు చేస్తున్నారు.

Related posts