telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా నియంత్రిణలో ప్రభుత్వం చేతులెత్తేసింది: కళా వెంకట్రావు

kalavenkat rao tdp

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు స్పందించారు. కరోనా నియంత్రిణలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వ నిర్లక్షం కారణంగానే రాష్ట్రంలో కేసులు 5 లక్షలు దాటాయన్నారు. అత్యధిక కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందన్నారు.

క్వారంటైన్ కేంద్రాల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని కళా వెంకట్రావు పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మూడు రాజధానులను పక్కనపెట్టి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు.

Related posts