కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె లక్ష్మణ్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 44ను పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని కోరినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు కొత్త విధానం తీసుకువస్తున్నారని మండిపడ్డారు. 12 వేల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని ఆరోపించారు. ఇక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కొమ్ము కాస్తు.. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక: మంత్రి అనిల్