telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐదు విడతలలో .. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ..

election-commission

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటి దశ పోలింగ్‌ నవంబర్‌ 30న జరగగా, చివరి దశ పోలింగ్‌(ఐదో విడుత) డిసెంబర్‌ 20 జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 23న వెల్లడిస్తారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ సిఇసి సునీల్ అరోరా, ఇసి సుశీల్‌ చంద్ర జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీ కాలపరిమితి 2020 జనవరి 5తో ముగుస్తుంది. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో 28 ఎస్టీ, 9 ఎస్సీ, 44 జనరల్‌ స్థానాలు.

మొదటి దశలో 13 స్థానాలకు నవంబర్‌ 30న, రెండో దశలో 20 స్థానాలకు డిసెంబర్‌ 7న, మూడో దశలో 17 స్థానాలకు డిసెంబర్‌ 12న, నాలుగో దశలో 15 స్థానాలకు డిసెంబర్‌ 16న, ఐదో దశలో 16 స్థానాలకు డిసెంబర్‌ 20న ఎన్నికలు జరుగనున్నాయి. 2,26,58,948 మంది ఓటర్లు ఉన్నారు. నక్సల్స్‌ ప్రభావం ఉన్న 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం బిజెపి సర్కార్‌ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2000లో రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగే నాలుగో అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

Related posts