telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్పోరేటర్ పదవికి కరీంనగర్ ఎంపీ రాజీనామా

bandi samjay mp

బీజీపీ నేత , కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ తన కార్పోరేటర్‌ పదవికి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించిన సంజయ్‌ తన కార్పోరేటర్‌ పదవికి రాజీనామా చేశారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా లేఖను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె మురళీకృష్ణ ద్వారా నగరపాలక సంస్థ కమీషనర్ భద్రయ్యకు పంపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయిన బండి సంజయ్‌కు సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీ బండి సంజయ్‌కు రావడం విశేషం.

Related posts