telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జమ్మూ-కశ్మీర్‌లో ఉద్రిక్తత.. నలుగురు ఉగ్రవాదులు మృతి

ఎన్నిసార్లు దెబ్బతిన్న పాక్‌ ఉగ్రవాదులకు బుద్ది రావడం లేదు. తాజాగా మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అయితే… ఉగ్రవాదులకు భద్రతాబలగాలు సరైన సమాధానమే చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని నగరోటా జిల్లా లాజా వద్ద ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జమ్మూ నుంచి శ్రీనగర్‌ బస్సులో వెళుతుండగా నగరోటా వద్ద భద్రతా బలగాలు జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌ కౌంటర్‌ అనంతరం కేంద్ర బలగాలతో గాలింపు తీవ్రం చేశారు. మరోవైపు పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రెనెడ్‌ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రెనెడ్‌ దాడి చేయగా.. అది తప్పి పౌరులు గాయపడ్డారు. దీంతో పుల్వామాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.

Related posts