telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

డ్రాగన్ కంట్రీకి షాక్‌ ఇచ్చిన నేపాల్…

నేపాల్ కు ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదా కానీ చైనాకు ఆ విషయంలో షాక్ ఇచ్చింది. తమ పార్టీలో తలెత్తిన ఇబ్బందులను తానే పరిష్కరించుకోగలనని, ఆ సత్తా తనకుందని ప్రకటించారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని చైనా రాయబారి హౌ యాంకీకే ముందే కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది.. దీంతో.. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది ఇప్పుడు. కాగా, నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విబేధాలు బయటపడ్డాయి… ప్రధాని కేపీ శర్మ ఓలీకి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ మధ్య విభేదాలు రచ్చగా మారాయి.. ప్రధాని ఓలీ శర్మను టార్గెట్ చేసిన ప్రచండ… ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవరకు వెళ్లింది వ్యవహారం. అయితే, ఈ వివాద పరిష్కారానికి చైనా రాయబారి హౌయాంకి రంగంలోకి దిగారు.. పలువురు నేతలతో చర్చలు జరిపారు. దీనిపై విమర్శలు వచ్చినా.. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సమర్థించుకుంది.. తమ పార్టీలో ఇబ్బందులు చైనాకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చింది.. కానీ, ఉన్నట్టుండి.. చైనా రాయబారి హౌ యాంకి ముందే షాకింగ్ కామెంట్స్‌ చేశారు ప్రధాని కేపీ శర్మ ఓలీ.

Related posts