telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే ఇబ్బందులు తొలగిపోతాయా ? : లోకేష్‌

Lokesh Tdp

ఏపీని తుఫాన్‌ ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పంట నష్టాన్ని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు సీఎం జగన్‌. ఈ ఏరియల్‌ సర్వేపై నారా లోకేష్‌ కౌంటర్‌ వేశారు. గాల్లో తిరుగుతే సమస్యలు పరిష్కారం కావని సెటైర్‌ వేశారు. ” గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా సీఎం జగన్‌ గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే! అధికారంలోకొచ్చాక 5వంద‌లు ఇస్తామనడం రివర్స్ టెండరింగ్‌లో భాగ‌మా? నివర్ తుఫాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లింది. వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడ‌లు క‌డుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తే అంతులేని తుఫాను‌ న‌ష్టం తెలుస్తుంది. ” అంటూ లోకేష్‌ పేర్కొన్నారు.

Related posts