telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్ముకశ్మీర్ వెళ్లేందుకు ఏచూరికి సుప్రీం అనుమతి

seetharam echuri

జమ్ముకశ్మీర్ పర్యటకు వెళ్లేందుకు సీపీఎం నేత సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అనంతనాగ్ లో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లేందుకు మొహమ్మద్ అలీమ్ సయీద్ అనే విద్యార్థికి సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

తమ పార్టీ నేత మొహమ్మద్ యూసుఫ్ తరిగామీని కలిసేందుకు అక్కడకు వెళ్లేందుకు అనుమతించాలని సీతారాం ఏచూరి పిటిషన్ వేశారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న తన మిత్రుడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని అతన్ని కలిసేందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ వెళ్లేందుకు మీకు అనుమతిస్తున్నామని, కానీ అక్కడ ఏదైనా సమస్యలో మీరు భాగస్వామి అయితే… అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించారు.

Related posts