అన్నా చెల్లెళ్ళ అపురూప బంధాన్ని చాటే రక్షా బంధన దినోత్సవం వేడుకలు తెలంగాణలో ఆనందోత్సాహాల మధ్య జర్గుతున్నాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణవర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సోదరి కల్వకుంట్ల కవిత కేటీఆర్ కు రాఖీ కట్టారు. అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సోదరికి కేటీఆర్ స్వీట్ తినిపించి రాఖీపండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయమై కేటీఆర్ స్పందిస్తూ కొన్ని అనుబంధాలు చాలా ప్రత్యేకమైనవని వ్యాఖ్యానించారు.