telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయా: కుమారస్వామి

CM Kumaraswamy killing order

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో అధికారపీఠంపై కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి, కుమారస్వామికి వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి విశ్వాస పరీక్షలో స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సీఎం కుమారస్వామి తన రాజీనామా లేఖను స్వయంగా గవర్నర్ వాజూభాయ్ వాలాకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కర్ణాటక ప్రజలు తనను క్షమించాలని కోరారు. పూర్తికాలం కొనసాగడంలో విఫలమయ్యానని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు చేయగలిగినంత మేలు చేశానని అన్నారు. రైతులకు రుణమాఫీ చేశానని వివరించారు. ఏడాదిగా క్షుద్రరాజకీయానికి బలవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts