telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వలస కార్మికులపై సీఎం జగన్ కీలక నిర్ణయం

cm jagan ycp

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దేశంలోని లక్షల మంది వలస కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. ఉన్నచోట తిండి లేక, స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక వారి బాధలు వర్ణనాతీతం. అందుకే చాలామంది వలస కార్మికులు కాలినడకనే ప్రమాదకర రీతిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో తమ సొంత రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ గుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా సరే, వారిని బస్సుల్లో ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వలస కార్మికులు, కూలీల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, తాగునీరు, భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Related posts