నేటి హైకోర్టు తీర్పు ఎంతో మంది ఆర్టీసీ కార్మికులకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి విరమించిన రోజు కూడా అదే జరిగిందన్నారు. కానీ దీక్ష విరమించిన వెంటనే తెలంగాణ రాలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ మాదిరిగానే కార్మికులు ఏ లక్ష్యంతో సమ్మె మొదలు పెట్టారో నూటికి నూరు శాతం ఆ లక్ష్యాన్ని సాధిస్తారని కార్మికుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 46 రోజులకు చేరిన సందర్భంగా దుబ్బాక బస్సు డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. గతంలో పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కంటే వెయ్యి రేట్లు నయమన్నారు.
బీజేపీ లీడర్ రఘునందన్ రావుతో కలిసి కార్మికులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు మందకృష్ణ. ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని గ్దదె దింపే సత్తా ప్రజలకుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనుల నిలబెట్టిన ఘనత ఆర్టీసీ కార్మికులకే దక్కిందన్నారు మందకృష్ణ. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కార్మికులు అడ్డుపడు తున్నందునే సెల్ఫ్ డిస్మిస్ అంటున్నారని విమర్శించారు.తప్పకుండా కార్మికులు విజయం సాధిస్తారన్నారు. ప్రభుత్వాన్ని, కార్మికులను చెరో మెట్టు దిగాలని హైకోర్టు చెప్పింది గానీ.. కార్మికులు మెట్టు దిగాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
ఇది ప్రజారాజ్యమా.. నియంతల ప్రభుత్వమా?: టీడీపీ నేత గోరంట్ల