కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తాంగా అన్ని దేశాలు పలు చర్యలను చేపడుతున్నాయి. గల్ఫ్ దేశం ఖతార్ ఈ విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. సామాజిక దూరాన్ని పాటించడం, ముఖాలకు మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది. ఒక వేళ ముఖానికి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 2 లక్షల రియాల్స్ జరిమానాతో పాటు, మూడేళ్లు జైలుకు కూడా పంపనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఖతార్ జనాభా 27 లక్షలు. వీరిలో 28 వేల మంది కరోనా బారిన పడ్డారు. అయితే కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఊరటనిచ్చే అంశం. ఖతార్ లో నిర్మాణ రంగ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మసీదులు, రెస్టారెంట్స్, సినిమా హాళ్లు, బార్స్ అన్నీ మూసివేశారు.
లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయం: మంత్రి బొత్స