telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓ ఇంట్లోంచి మహిళ ఏడుపులు… కంప్లైంట్ తో ఆ ఇంటికొచ్చిన పోలీసులకు షాక్

Police

ఫ్లోరిడాలోని లేక్ వర్త్ బీచ్‌లో ఉండే ఓ వ్యక్తి చిలుకను పెంచుకుంటున్నాడు. దాని పేరు రాంబో. అది అప్పుడప్పుడు అచ్చం మనుషుల గొంతుతో అరుస్తుండేది. డిసెంబర్ 29న కూడా ఇలాగే రాంబో ఓ మహిళలా ఏడుస్తూ.. హెల్ప్, హెల్ప్ అని అరిచింది. అది విన్న పొరుగింటి మహిళ ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని భ్రమపడి పామ్ బీచ్ కౌంటీ పోలీసులకు సమాచారం అందించింది. దాంతో పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి యజమాని ఇంటి ముందు కారు మరమ్మత్తు చేస్తూ కనిపించాడు. పోలీసులు అతడ్ని పిలిచి మీ ఇంట్లోంచి మహిళ ఏడుస్తూ, కాపాడమని అరుస్తున్నట్లు పక్కింటి వారు విని మాకు సమాచారం అందించారని ఒకసారి ఇంట్లో సోదా చేయాలని చెప్పారు. పోలీసుల మాటలు విన్న యజమాని వెంటనే లోపలికి వెళ్లి రాంబోను తీసుకొచ్చాడు. అనంతరం చిలుకతో మాట్లాండించాడు. అది విన్న పోలీసులకు నోటమాట రాలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను లేక్ వర్త్ బీచ్ పోలీసులు వారి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


Video Source: ViralHog

Related posts