telugu navyamedia
రాజకీయ

ల‌ఖింపూర్ ఖేరి వీడియో ప్రధానికి ట్యాగ్ చేసిన ప్రియాంకా గాంధీ..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఈ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. లఖింపూర్‌ఖేర్‌ గ్రామానికి వెళుతున్న ప్రియాంక గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకుని, సీతాపూర్‌లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించిన సంగతి తెలిసిందే.

Remember the farmers who got India her freedom': Priyanka slams PM Modi's silence over Lakhimpur Kh- The New Indian Express

‘‘నరేంద్ర మోదీ జీ.. మీ ప్రభుత్వం ఎలాంటి ఎఫ్ఐఆర్, ఆదేశాలు లేకుండానే 28 గంటలుగా నన్ను నిర్బంధంలో పెట్టింది. కాకానీ రైతులను జీపుతో తొక్కించిన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?” అని ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు. వెంటనే అలాంటి నిందితులను అరెస్ట్‌ చేయాలని.. తమలాంటివారిని కాదంటూ తెలిపారు.

లఖింపూర్ ఖేరీ

ఈ సంద‌ర్భంగా ప్రియాంక ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలంటూ ఆమె పేర్కొన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం , వెనుకనుంచి వారిని గుద్దుకుంటూ వేగంగా ఈడ్చుకెళ్లింది. ఆ జీప్ వెనుక ఒక ఫార్చునర్ కారు సైరెన్ల‌తో వెళ్లిన‌ట్లు వీడియోలో కనిపిస్తోంది.

Live Updates: Priyanka Gandhi Vadra Hits Out At PM After Lakhimpur Kheri Violence In Uttar Pradesh

ఈ ఘటన తర్వాత రైతులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో కొంద‌రు చ‌నిపోయారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. దిగొచ్చిన యూపీ ప్రభుత్వం.. చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు 45 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది. రిటైర్డ్ జ‌డ్జితో ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

Related posts