telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి

jeevan-reddy

తెలంగాణలో ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని విమర్శించారు. ఒక్క అదనపు పోస్టు కూడా క్రియేట్‌ చేయకుండా.. ఉన్నవాళ్లతోనే పని చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలని శాసించాయన్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా 29శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. నిరుద్యోగ భృతి ఇవాదం లేదని విమర్శించారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదన్నారు.

Related posts