telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

దక్షిణాది రాష్ట్రాలు హిందీని అంగీకరించవు: రజనీకాంత్

rajinikanth on loksabha election support

భారత్ కు ఒకే జాతీయ భాష ఉండాలనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేపీ అభిమాని, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ భాషను కూడా బలవంతంగా రుద్దకూడదు. దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అంగీకరించవన్నారు.

దేశాభివృద్ధికి ఒకే భాష మంచిదే. కానీ దురదృష్టవశాత్తూ భారత్ లో అది సాధ్యపడదని అన్నారు. ఉత్తరాదిలోనే ఒకే భాష విషయంలో ఏకాభిప్రాయం కుదరని తెలిపారు. మరో వైపు షా వ్యాఖ్యలపై తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమ గుర్తింపును, భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని హెచ్చరించాయి.

Related posts