telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోల సినిమాలకు క్రేజీ టైటిల్స్ రిజిస్టర్

Tollywood

ఇటీవల ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు రిజిస్టర్ చేయించిన ఆసక్తికర టైటిల్స్ పై హాట్ గా చర్చ నడుస్తోంది టాలీవుడ్ వర్గాల్లో. స్టార్ హీరోల సినిమాలన్నీ షూటింగ్ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది వరుసగా స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడనుంది టాలీవుడ్. మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా కోసం తాజాగా ఫిలిం చాంబర్‌లో నిర్మాతలు రిజిష్టర్ చేయించిన టైటిల్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. గతకొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగా ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు నిర్మాతలు. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీకి ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ వినబడుతున్న సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు ‘96’ తెలుగు రీమేక్ కోసం ‘జాను’ టైటిల్ ఇచ్చేశారు యూవీ క్రియేషన్స్ వారు. ఇప్పుడు ఈ సినిమా కోసం ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే రెండు టైటిల్స్ నమోదు చేయించారు. వీటిలో ‘రాధే శ్యామ్’ ఫైనల్ కావొచ్చని తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ‘పింక్’ రీమేక్ కోసం కూడా సరికొత్త టైటిల్ రిజిష్టర్ చేయించారు. ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కనబడుతుంది. తాజాగా ‘వకీల్ సాబ్’ అనే పేరు నమోదు చేశారు.

Related posts