telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా సెకండ్ వేవ్… అత్యవసర “మే”నెల

పడినట్లే పడిన కరోనా కెరటం

వడివడిగా లేచి,

ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.

కష్టకాలం నుండి

గట్టెక్కామనుకునే లోపే,

కల్లోలంలో ముంచెత్తుతోంది !

 

వందలు-వేలు, వేలు-లక్షలు

పెరిగి పోతున్న క్షతగాత్రులు !

ఆసుపత్రుల్లో బెడ్లు లేవు !

ఆక్సిజన్ సిలెండర్లు లేవు !

స్మశానాల్లో స్థలంలేదు !

ఛితిమంటలు ఆరట్లేదు !

 

కాలడానికి కూడా

“క్యూ” కడుతున్న రోగులు !

పూడ్చిపెట్టండంటూ

పోటీ పడుతున్న శవాలు !

కనీ, వినీ, ఎరుగని కల్లోలమిది !

కరోనా చేస్తున్న కరాళ న్రృత్యమిది !

 

ఇపుడు కూడా మేలుకోకపోతే,

ఇక మనం కోలుకోలేము.

ప్రతి ఒక్కరం జాగ్రత్త పడదాం.

ప్రాణాపాయం నుండీ బయట పడదాం.

పాటించాల్సిన నియమాలు మూడే.

ఈ మూడే కరోనాకు విరుగుడు !

 

మాస్కు లేకుండా బయటికెళ్ళొద్దు.

మనిషికీ మనిషికీ మద్య

రెండు మీటర్ల దూరం మరువొద్దు.

సబ్బుతో గానీ శానిటైజర్ తోగానీ

చేతులు కడగకుండా

ముక్కు,నోరు, కళ్ళను తాకొద్దు.

 

ఇవే మన రక్షణ కవచాలు.

ఒక నెల అందరం ఇవి పాటిస్తే చాలు

కరోనా అంత”మే”

మనమంతా క్షేమ”మే”

ఇది మనకిపుడు అవసర”మే” కాదు

అత్యవసర”మే” !

 

Related posts