telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మిడిల్ క్లాస్ బతుకులు…

నిత్యావసరాలపై పెంపు
కూరగాయలు ధర మంట మంట
ఉల్లి రోజుకోరకంగా గిల్లుడు
పెట్రోల్ ధర పెంపు
గ్యాస్ ధర పెంపు
పన్నులు పెంపు
జీతాలు మాత్రం పెరగవు
జీవితంపై మోయలేని భారం
బ్రతుకు విలువ శూన్యం
రోజులు గడిచే కొద్దీ
వయసు ఉడికిపోతుంది
ఉన్నవాడు ఎక్కువై ఒళ్ళు పెంచి
జిమ్ములంట, పబ్బులంట తిరుగుతుంటే
లేనివాడు రోజంతా అడ్డమైన చాకిరీ చేసి
వచ్చే జీతం సరిపోక
అప్పులు చేసి వడ్డీలు కట్టలేక
తబ్బెడు ముబ్బెడు
పెంపు పెంపు అని బ్రతుకు భారం పెరుగుదలే
తప్ప ఇంకేముంది…? చెప్పుకోడానికి
మధ్యతరగతి వాడు గతుకుల రోడ్లపై
ఎదురుదెబ్బలు తగిలించుకుంటూ
ఎదగలేక ఎక్కిళ్ళతో చావాల్సిందే…!
ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమో….?
పాలకుల దోపిడినో…?

Related posts