telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాంది తర్వాత నరేష్ ఎవరితో అంటే..?

Allari-Naresh

అల్లరి నరేష్ కొంతకాలంగా వరుస అపజయాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. అంతేందుకు ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన బంగారు బుల్లోడు కూడా ప్లాప్ అయింది. అయితే తన మళ్లీ ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలనుకున్న నరేష్ కొత్తగా పక్కా సీరియస్ పాత్రను ఎంచుకున్నారు. ఆ సినిమానే నాంది. నాంది సినిమాలో నరేష్ తన నట విశ్వరూపం చూపించారనడంలో అతిశయోక్తేమీ లేదు. ఈ సినిమా అందరి ఊహలను మించి అలరిచింది. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా నాందీ టీమ్ అంతా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన నరేష్ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ‘ఈ సినిమాతో నన్ను మళ్లీ పొందాను. ఇటువంటి అవకాశం నాకు అందించినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఇలాంటి పాత్రలు ఇంకా చేయాలనిపిస్తోంది.. చేస్తాను. అంతేకాకుండా నేను నా తరువాతి చిత్రాన్ని కూడా విజయ్ గారి దర్వకత్వంలోనే చేస్తాన’ని నరేష్ అన్నారు. నాంది సినిమాతో హిట్ అందుకోవడంతో తమ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని నరేష్ అనుకుంటున్నారని, అందుకే అదే దర్శకుడితో మరో సినిమాకి పచ్చజెండా ఊపారని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మారి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts