telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వార్ : ఆకట్టుకుంటున్న “ఘుంగ్రూ” వీడియో సాంగ్

War

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. ఈ చిత్రంలో వాణీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది.హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లోని హృతిక్, టైగర్ స్టంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఇటీవల విడుదలైన ట్రైల‌ర్ లోని సీన్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా “ఘుంగ్రూ” అనే వీడియో సాంగ్ ను ఈరోజు విడుదల చేశారు. హృతిక్‌కు జోడీగా వాణీ కపూర్ ఈ పాటలో తన అందచందాలను ప్రదర్శించింది. చూడడానికి, వినడానికి అద్భుతంగా ఉన్న ఈ పాటను అర్జీత్ సింగ్, శిల్పారావు పాడారు. వాణీకపూర్ హృతిక్‌తో నటించడం ఇదే తొలిసారి. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts