telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు

మార్చి 23 దినఫలాలు, మంగళవారం

మేషం : రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం మంచిది. వ్యవహారాల్లో జయం, సమర్థతకు గుర్తింపు పొందుతారు. మిమ్మలను తక్కువగా అంచనా వేసినవారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు.

 

వృషభం : కుటుంబీకుల మధ్య ఒక శుభకార్య విషయం ప్రస్తావనకు వస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. నిశ్చితార్థం, గృహ ప్రవేశాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. బాగా శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తికావు.

 

మిథునం : వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. పాత మిత్రుల కలయికతో మీ మార్పు వస్తుంది. క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరువుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.

 

కర్కాటకం : ఆస్తి, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్థులు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.

 

సింహం : స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి కాగలవు. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. వైద్యులకు ఆపరేషన్ల విషయంలో ఏకాగ్రత అవసరం. రావలసిన ఆదాయంలో కొత్త మొత్తమైనా అందుతుంది.

 

కన్య : ఉపాధ్యాయులకు ఒత్తిడి తప్పదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసి రాగలదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు అనవసర భయాందోళను విడనాడి శ్రమించి సత్ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు.

 

తుల : అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. హోటల్, తినుబండారాలు క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. మీ సంతానం కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.

 

వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. దుబారా, నివారించాలన్న మీ యత్నం నెరవేరదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.

 

ధనస్సు : స్త్రీలతో మితంగా సంభాషించడం మంచిది. మీ ప్రత్యర్థుల తీరును ఓ కంట కనిపెట్టడం మంచిది. ప్రముఖుల సహకారంతో కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఏకాగ్రత అవసరం.

 

మకరం : సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. బంధు మిత్రుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

 

కుంభం : ఉద్యోగస్తులు సలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

 

మీనం : చేపట్టిన పనుల హడావుడిగా పూర్తి చేస్తారు. సోదరుల మధ్య అవగాహన లోపిస్తుంది. పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెగలవలసి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, తరచూ విందులు వంటి శుభపరిణామాలుంటాయి.

Related posts